తెలంగాణ
హైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్ మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డి
02-11-2026 15:31

దేశంలో నరేంద్రమోదీ నాయకత్వానికి ఉన్న గుర్తింపు, స్థిరాస్తి రంగంలో హైదరాబాద్‌కు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నరెడ్కో ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రాపర్టీ షో నిన్నటితో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, హైదరాబాద్‌ను ల్యాండ్ మాఫియా, భూకబ్జాలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్నారు. కోర్టు వివాదాల సమస్యను ప్రభుత్వం, న్యాయస్థానాలు, నరెడ్కో సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని, మూడు బుల్లెట్ రైలు కారిడార్ల ప్రాథమిక పనులు సాగుతున్నాయని, మెట్రో రెండో విడతకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు.
xPress24, HYDERABAD, November 2,