తెలంగాణ
హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ పాదయాత్ర
20-11-2026 11:26

భారత్‌ను 2029 నాటికి మాదకద్రవ్య రహిత దేశంగా మార్చే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ – హైదరాబాద్ వాక్స్’ పాదయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో భాగస్వాములై, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని కిషన్‌రెడ్డి కోరారు.
xPress24, Hyderabad, November 20,