ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
02-11-2026 15:06

హైదరాబాద్ లో ఈరోజు భారతీయ జనతాపార్టీ 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' పేరుతో చేపడుతోన్న మహా పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అమిత్ షా ముందుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. సాయంత్రం బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమయ్యే మహా పాదయాత్ర మొజంజాహి మార్కెట్ వరకు కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు.. బీజేపీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. యాత్ర ముగింపుగా మొజంజాహి మార్కెట్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కోసం బీజేపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు.
xPress24, HYDERABAD, November 2,