తెలంగాణ
హైదరాబాద్‌లో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
13-11-2026 10:21

తెలంగాణలోని హైదరాబాద్‌లో 23 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నమూనా చిత్రాలను ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు.హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ ప్రాంగణంలో ప్రపంచస్థాయి సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, విజ్ఞానంపై ఆసక్తిని కలిగించేలా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఆసక్తికరమైన ప్రదర్శనలు, ఖగోళ విశేషాలు, అంతరిక్ష అద్భుతాలు, సైన్స్, రోబోటిక్స్, ఆవిష్కరణలకు సంబంధించిన ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
xPress24, Hyderabad, November 13,