అంతర్జాతీయం
101 కిలోల హెరాయిన్ సీజ్
23-09-2026 05:30
పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో పంజాబ్ పోలీసులు 101 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఫరీద్‌కోట్‌లో ఈరోజు ఒక కీలక స్మగ్లింగ్ ముఠాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 47 కిలోలకు పైగా హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి మూడు పిస్టళ్లు, రెండు వాహనాలను జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు రోజు అమృతసర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) విభాగం మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసి.. ముగ్గురు కీలక సూత్రధారులను అరెస్టు చేయడమే కాకుండా 17 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.
xPress24, Krishna District, September 20,