తెలంగాణ
2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై తెలంగాణ బీజేపీ ఫోకస్
24-09-2026 09:59
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సూచించారు.
xPress24, HYDERABAD, September 24,
నాంపల్లిలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలపై కీలకంగా చర్చించారు. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నేతలకు రామచందర్ రావు సూచించారు.
మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణులు, నాయకులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఓటర్ల నమోదుతో పాటు ప్రజల్లోకి పార్టీ విధానాలను బలంగా తీసుకెళ్లేలా పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలని రామచందర్ రావు పేర్కొన్నారు.