ఆంధ్రప్రదేశ్
20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమం
02-10-2026 15:42

రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటైతేనే యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జాబ్‌మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
xPress24, Nellore, October 2,