తెలంగాణ
2028 జూన్ నాటికి శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేస్తాం
12-10-2026 10:55

శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెం, శేరిలింగోటం వద్ద 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తేలకంటిగూడెం నుంచి తొరగల్ జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు.. అలాగే చెట్లచెన్నారం నుంచి చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
xPress24, Kanagal, October 12,