ఆంధ్రప్రదేశ్
27న ప్రపంచ పర్యాటక దినోత్సవం
26-09-2026 10:30

ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 130కిపైగా పర్యాటక ప్రాంతాల్లో ‘నివు’ ఏఐ క్యూఆర్ కోడ్‌లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కిపైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ‘ది గోదావరి కాల్స్’ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
xPress24, Amaravathi, September 26,