xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్

372 కుటుంబాలకు నెరవేరిన సొంతింటి కల Shanthi By Shanthi September 28, 2026

29-09-2026 16:58
372 కుటుంబాలకు నెరవేరిన సొంతింటి కల Shanthi By Shanthi September 28, 2026
మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో 372 మందికి పట్టాల పంపిణీ కుంచనపల్లిలో లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు
‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో 372 మందికి పట్టాల పంపిణీ కుంచనపల్లిలో లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఃమన ఇల్లు-మన లోకేశ్ః కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ భూముల్లో చాలాకాలంగా నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దాదాపు 80 శాతం పట్టాల సమస్యను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. మిగిలిన కేంద్ర ప్రభుత్వ భూముల సమస్యల పరిష్కారం కోసం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదల దశాబ్దాల కలను నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు రెండు విడతలుగా పట్టాల పంపిణీ పూర్తి చేశారు. తొలి విడతలో 3,002 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు అందజేశారు. ఈ రెండు విడతల్లో కలిపి సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూములకు ఉచితంగా శాశ్వత హక్కులు కల్పించారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.