జాతీయం
57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
09-10-2026 09:44

వస్తు సేవల పన్ను - జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35 శాతం ఉందని ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు.పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు.
xPress24, New Delhi, October 9,