ఆంధ్రప్రదేశ్
70 మంది వైద్యులను విధుల నుంచి తొలగింపు
03-10-2026 09:09

సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. ఏడాదికి పైగా విధులకు హాజరుకాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీసు నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి, నిబంధనలను అనుసరించిన అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు.
xPress24, Amaravathi, October 3,