అంతర్జాతీయం
81వ సర్వసభ్య సమావేశం `హై లెవల్ వీక్`
23-09-2026 05:30
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం ‘హై లెవల్ వీక్’కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలసి ఆయన ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్రమంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
xPress24, Krishna District, September 20,