xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
జాతీయం

CSIR 85వ వ్యవస్థాపక దినోత్సవం -జితేంద్ర సింగ్

26-09-2026 10:09
CSIR 85వ వ్యవస్థాపక దినోత్సవం -జితేంద్ర సింగ్
గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయ‌న ఈరోజు పాల్గొని మాట్లాడుతూ... గత 5, 6 దశాబ్దాలతో పోలిస్తే గడచిన‌ పదేళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధన కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. సాంకేతికత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతను ప్రస్తావిస్తూ... దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి సాంకేతిక సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరమని చెప్పారు. 2047 నాటికి విక‌సిత్ భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి మోదీ దార్శనికతలో.. భవిష్యత్‌ సాంకేతిక అవసరాలను తీర్చే దిశగా CSIR పని చేయాలని జితేంద్ర సింగ్ ఆకాంక్షించారు.
xPress24, Krishna District, September 25,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.