తెలంగాణ
అక్టోబర్ 7న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం
30-09-2026 15:50

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7న జూబ్లీహిల్స్ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈరోజు బేగంపేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ గవర్నర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీలు, సర్టిఫికెట్లు అందుకోనున్నారని, ప్రఖ్యాత నిర్మాత బి. నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు వివరించారు.
xPress24, HYDERABAD, September 30,