xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
ఆంధ్రప్రదేశ్

అక్టోబరు 8న ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

06-10-2026 09:33
అక్టోబరు 8న ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన
అక్టోబరు 8వ తేదీన ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ఆదేశించారు.
xPress24, Rampachodavaram, October 5, రంపచోడవరం, అక్టోబరు 5: అక్టోబరు 8వ తేదీన ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం రంపచోడవరం కలెక్టరేట్‌లోని ఐటీడీఏ సమావేశ మందిరంలో పర్యటన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన ప్రాథమిక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యటనకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఎటువంటి జాప్యం లేకుండా అన్ని ఏర్పాట్లను వెంటనే ప్రారంభించి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు సమన్వయంతో చేపట్టిన కార్యాచరణను ప్రామాణికంగా తీసుకుని, అదే తరహాలో ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను స్పష్టంగా గుర్తించి, సంబంధిత పనులను తక్షణమే ప్రారంభించాలని, పనుల పురోగతిని రోజువారీగా సమీక్షించుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం జిల్లాకు చేరుకుని, అక్కడి నుంచి నిర్దేశించిన రూట్‌మ్యాప్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్న అనంతరం ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల వరకు రహదారి మార్గాన్ని సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రహదారుల వెంబడి పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పర్యటన మార్గాన్ని పరిశీలించి, రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.