ఆంధ్రప్రదేశ్
అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలి: మంత్రి వై. సత్యకుమార్ యాదవ్
12-10-2026 14:23

అంకుర పరిశ్రమల (స్టార్టప్‌ల) స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ సూచించారు.
xPress24, Vijayawada, October 12,
విజయవాడ, అక్టోబర్ 12:
అంకుర పరిశ్రమల (స్టార్టప్‌ల) స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడలోని కొత్తపేటలో ఉన్న స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత తమ వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టి, కేవలం ఉద్యోగాలు పొందేవారిగానే కాకుండా, ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలో అంకుర పరిశ్రమలకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని, నూతన ఆవిష్కరణలతో పారిశ్రామిక రంగంలో రాణించాలని సూచించారు.