తెలంగాణ
అచ్చంపేటలో హైస్పీడ్ రైల్ కారిడార్ స్థలాల పరిశీలన
08-10-2026 16:00

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా అచ్చంపేట మండలంలో ఎలివేటెడ్ కారిడార్, సబ్ స్టేషన్ నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్-బెంగళూరు ప్రయాణ సమయం రెండు గంటలకు తగ్గుతుందని, ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
xPress24, HYDERABAD, October 8,