జాతీయం
అంత్యోదయ దివస్
25-09-2026 14:56

దేశంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది.
xPress24, Vijayawada, September 25,
విజయవాడ, 25 సెప్టెంబర్ 2026 : దేశంలోని పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు.
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్‌ను నిర్వహిస్తున్నారు.