ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినం
13-10-2026 14:02

అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు.
xPress24, Vijayawada, October 13,
అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంతో పాటు, విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన, అప్రమత్తత పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 13వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం – 2005 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని రూపొందించారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ ప్రణాళికలను అమలు చేస్తోంది.