xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్బుచ్చి అప్పారావు జీవితం ఆదర్శనీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ఉత్సవాల వైభవాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసాకోటబొమ్మాళి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర మంత్రుల శ్రీకారంసౌర విద్యుత్‌తో పర్యావరణ పరిరక్షణకు భరోసాదివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
జాతీయం

అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

13-10-2026 14:38
అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  విమర్శలు
రాహుల్ గాంధీ అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టులపై నిందలు వేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అనుకూలంగా నిర్ణయాలు రాలేదని సీజేఐ, సీఈసీలను బెదిరించే నియంతృత్వ రాజకీయాలు దేశంలో సాగవని హెచ్చరించారు.
xPress24, Delhi, October 13, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. కేవలం అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ నాయకత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మీకు అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే బెదిరిస్తారా?: కిషన్‌రెడ్డి న్యూఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌లు దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘానిది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిది బాధ్యతా? కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఈసీకి, సీజేఐకి ఉంటుందా? తమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వలేదని ఏకంగా సీజేఐని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. భారతదేశం ఏమైనా సోనియా గాంధీ కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీనా? దేశంలో కాంగ్రెస్ మార్కు నియంతృత్వ రాజకీయాలు సాగవు" అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ తీరు హాస్యాస్పదం పార్లమెంట్‌లో ప్రతిపక్షాల తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పులేదని, కానీ ఆ అధికారం కోసం సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం లాంటి వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీయడం దారుణమని అన్నారు. రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్య వైఖరిని దేశ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.