ఆంధ్రప్రదేశ్
అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
15-10-2026 14:33
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
xPress24, Amaravati, October 15,
అమరావతి, అక్టోబర్ 15:
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా డాక్టర్ అబ్దుల్ కలాం అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
తన ప్రసంగాలతో యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో స్ఫూర్తిని నింపిన కలాం జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.