ఆంధ్రప్రదేశ్
ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలు పాటించాలి
02-10-2026 09:49

ఆక్వా పరిశ్రమలు కచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భజలాలు కాలుష్యం బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.
xPress24, Mangalagiri, October 2,