ఆంధ్రప్రదేశ్
ఆక్వాఎక్స్ ఇండియా ఎక్స్‌పో
09-10-2026 14:49

ఆధునిక సాంకేతిక, పర్యావరణహిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
xPress24, Bhimavaram, October 9,
భీమవరం, 09 అక్టోబర్ 2026 : ఆధునిక సాంకేతిక, పర్యావరణహిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న ఆక్వాఎక్స్ ఇండియా–2026 ఎక్స్‌పోను కేంద్రమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఆదాయం, విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ ఆక్వా మార్కెట్‌లో భారతదేశం మరింత బలోపేతం కావడంలో ఆక్వా రైతుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎక్స్‌పోలు ఎంతగానో దోహదపడతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.