ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరులో జాతీయ రహదారి 67 బైపాస్ ప్రారంభం
13-10-2026 14:09

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి-67పై నిర్మించిన నూతన బైపాస్ రహదారిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి నుంచి దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించారు.
xPress24, Nellore, October 13,
నెల్లూరు జిల్లా, అక్టోబర్ 13:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి-67పై నిర్మించిన నూతన బైపాస్ రహదారిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతి నుంచి దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బైపాస్ రహదారి అందుబాటులోకి రావడంతో ఆత్మకూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు. ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.