xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
తెలంగాణ

ఆదిలాబాద్ రిమ్స్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేయాలి: పాయల్ శంకర్

25-09-2026 11:45
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు నవ జాత శిశువులు మృతి చెందడం బాధాకరమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
xPress24, Adilabad, September 24, ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 150 కోట్లు మంజూరు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. గతంలో ప్రభుత్వానికి తాను రాసిన లేఖను మీడియాకు చూపించారు. ఆరు నెలల క్రితం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించినప్పుడు తానే స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫోన్ చేసి.. ఆస్పత్రిలోని పరిస్థితులపై వివరించినట్లు పాయల్ శంకర్ తెలిపారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆస్పత్రి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరడంతోపాటు.. సమస్యల వారిగా వైద్యారోగ్య శాఖ మంత్రికి లేఖ ఇచ్చానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్త్ సురక్ష యోజనలో భాగంగా రూ.150 కోట్లతో అధునాతన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారన్నారు. కానీ గత, ప్రస్తుత ప్రభుత్వాలు వైద్యులను నియమించక పోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆస్పత్రిలో అవసరమైన డాక్టర్లను నియమించి, సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తేవాలని పాయల్ శంకర్ కోరారు. ఇటీవల రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు నవ జాత శిశువులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే సూచించారు. ఆస్పత్రిలో 150 పడకల అదనపు ఆస్పత్రితో పాటు, మౌలిక వసతులు, వైద్య సదుపాయాల కోసం సరిపడా నిధులు అవసరమని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ఈ వారంలోనే నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బైట్ : పాయల్ శంకర్, ఎమ్మెల్యే

🎥 వీడియో

ఆదిలాబాద్ రిమ్స్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేయాలి: పాయల్ శంకర్

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.