xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలంతీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలం
తెలంగాణ

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల సంఘం సీరియస్

24-09-2026 09:59
ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల సంఘం సీరియస్
తెలంగాణ మానవ హక్కుల సంఘం రిమ్స్ ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై కమిషన్ వివరణ కోరింది. ఈ ఘటనపై అక్టోబర్ 27న విచారణ చేపట్టనున్నట్లు కమిషన్ తెలిపింది.
xPress24, HYDERABAD, September 24, ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనలో నవజాత శిశువులు మృతి చెందారు. ఈ దుర్ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ సందర్భంగా ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. 27 మంది శిశువులు ఉన్న వార్డులో AC షార్ట్ సర్క్యూట్ వల్ల దట్టమైన పొగ అలముకుని 5 గురు ప్రాణాలు కోల్పోవడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రిమ్స్ ఆసుపత్రిలోని SNCU విభాగంలో భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ వ్యవస్థ నిర్వహణ, ఫైర్ అలారాలు, అగ్నిమాపక పరికరాల స్థితిగతులపై వివరణ ఇవ్వాలని వైద్య శాఖ ముఖ్యకార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.  ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రక్షణ చర్యలు, బాధ్యులపై చేపట్టిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. అక్టోబర్ 27న ఈ ఘటనపై విచారణను చేపట్టనున్నట్లు కమిషన్ తెలిపింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.