xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
తెలంగాణ

ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాదంపై సమగ్ర విచారణ.. 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్న మంత్రి దామోదర రాజనర్సింహ

23-09-2026 14:39
ఆదిలాబాద్ రిమ్స్ ఎస్.ఎన్.సి.యు వార్డులో ముగ్గురు శిశువులు మృతి చెందిన అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం రిమ్స్‌ను సందర్శించి సహాయక చర్యలను సమీక్షించిన ఆయన, 100 రోజుల్లో ఆసుపత్రిని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అదనంగా 150 పడకల ఎంసీహెచ్ భవనాన్ని నిర్మించి రిమ్స్‌ను 950 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
xPress24, Adilabad, September 23, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ చేపడతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి రానున్న 100 రోజుల్లో రిమ్స్‌ను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని భరోసా ఇచ్చారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, కలెక్టర్ రాజర్షి షా, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్‌లతో కలిసి మంత్రి రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. సోమవారం అర్ధరాత్రి ఎస్.ఎన్.సి.యు (SNCU) వార్డులో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, వైద్యులతో అత్యున్నత సమీక్ష ఘటన స్థలానికి చేరుకున్న మంత్రి ఎస్.ఎన్.సి.యు విభాగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సహాయక చర్యలతో పాటు ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, ఎక్కడా లోపం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, వైద్యులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భద్రతా లోపాలపై విచారణ.. 150 పడకల ఎంసీహెచ్ భవనం ఏర్పాటు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, ముగ్గురు పసికందుల మృతి అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన చోట ప్రైవేట్ ఆసుపత్రుల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యంపై విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో మాతా, శిశు సంరక్షణను పటిష్టం చేసేందుకు రిమ్స్‌లో ప్రత్యేకంగా 150 పడకల ‘మదర్ అండ్ చైల్డ్ హెల్త్’ (MCH) భవనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 800 పడకలకు ఇది అదనంగా చేరితే రిమ్స్ 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుతుందని, మరిన్ని నూతన విభాగాలను ఇక్కడ అందుబాటులోకి తెస్తామని వివరించారు. బైట్: దామోదర రాజనర్సింహ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

🎥 వీడియో

ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాదంపై సమగ్ర విచారణ.. 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్న మంత్రి దామోదర రాజనర్సింహ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.