తెలంగాణ
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం
09-10-2026 09:57

హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్‌ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు.
xPress24, Hyderabad, October 9,