తెలంగాణ
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వివేక్
07-10-2026 15:03

ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో సమావేశం అయిన మంత్రి మాట్లాడుతూ... ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్–INTUC–TWU కూటమి అభ్యర్థులకు బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. కూటమి విజయం సాధిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులోనూ కృషి చేస్తామని తెలిపారు.
xPress24, HYDERABAD, October 7,