తెలంగాణ
ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్.. మెట్రోలో మంత్రుల జర్నీ
03-10-2026 14:12
హైదరాబాద్‌లో ఆర్టీసీ మరియు మెట్రో ఉమ్మడి డేపాస్‌ను సద్వినియోగం చేసుకుంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణించారు.
xPress24, Hyderabad, October 3,
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ మరియు మెట్రో రైల్ సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చిన ఉమ్మడి పాస్ విధానాన్ని మంత్రులు స్వయంగా పరిశీలించారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రజాభవన్‌లో శుక్రవారం ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ప్రయాణికులకు మరింత సౌలభ్యం
ఒకే పాస్‌తో ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లలో ప్రయాణించే సదుపాయం కల్పించడం ద్వారా నగర ప్రజలకు రవాణా మరింత సులువుగా మారుతుందని మంత్రులు పేర్కొన్నారు. ఈ ఉమ్మడి పాస్‌ల పనితీరును స్వయంగా పరిశీలించేందుకు మంత్రులు ఈ ప్రయాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖతో పాటు వివిధ శాఖల ప్రముఖులు పాల్గొన్నారు.