తెలంగాణ
ఆసిఫాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా కొత్తపల్లి అనిత ఏకగ్రీవ ఎన్నిక
05-10-2026 15:41

ఆసిఫాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన చైర్మన్ గా కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి అనిత ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపెళ్లి శ్రీనివాస్ ఎంపిక కాగా నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు… ఎప్పటి నుండో రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నామని సేవా భావంతో పనిచేస్తున్న సొసైటీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు.
xPress24, HYDERABAD, October 5,