తెలంగాణ
ఆసిఫాబాద్‌లో భగత్ సింగ్ జయంతి వేడుకలు
28-09-2026 16:52

ఆసిఫాబాద్ జిల్లాలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి రాష్ట్ర నాయకుడు కార్తీక్ పూలమాలవేసి నివాళులు అర్పించగా, బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విప్లవ కార్యక్రమాలు చేస్తూ స్వాతంత్రమే లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు.
xPress24, HYDERABAD, September 28,