క్రీడలు
ఆసియా క్రీడలు 2026
28-09-2026 10:54

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో ఈరోజు జరిగిన మహిళల లాంగ్ జంప్ ఫైనల్లో ఆన్సీ సోజన్ ఎడప్పిల్లి రజత పతకాన్ని, పురుషుల హై జంప్‌లో సర్వేష్ కుషారే వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో హరిత భద్ర కాంశ్య పతకంతో మెరవగా.. డెకాథ్లాన్ ఈవెంట్‌లో తేజస్విన్ శంకర్ కాంశ్య పతకాన్ని సాధించాడు. ఇక మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్‌లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి కాంశ్య పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు జరిగిన స్క్వాష్ పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో అభయ్ సింగ్, అనాహత్ సింగ్ రజత పతకాలు పొందారు. దీనితో భారత పతకాల సంఖ్య 37కి చేరింది.
xPress24, Krishna District, September 27,