xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
క్రీడలు

ఆసియా క్రీడలు ప్రారంభం

23-09-2026 05:30
ఆసియా క్రీడలు ప్రారంభం
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు నిన్న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
xPress24, Hyderabad, September 20, జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు నిన్న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలోమా మిజుహో స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ తరఫున స్టార్ షూటర్, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, కబడ్డీ కెప్టెన్ పవన్ సెహ్రావత్ కలిసి పతాకధారులుగా వ్యవహరించారు. ఆసియా వ్యాప్తంగా 45 దేశాల నుంచి సుమారు 11 వేల మందికి పైగా అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగారు. మొత్తం 43 క్రీడలు, 71 విభాగాల్లో 460 పైచిలుకు స్వర్ణ పతకాల కోసం ఈ పోటీలు సాగుతున్నాయి. పాజ్.. ఆసియా క్రీడల ఆరంభోత్సవం రోజే పతకం సాధించాలన్న భారత్‌ ఆశ తీరలేదు. టెక్‌బాల్‌ ఆటలో సెమీఫైనల్లో క్విమ్సి డిసౌజా ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో ఆమె 12-7, 9-12, 7-12తో సుమయా ఇండోనేసియాకు తలొంచింది. తొలి గేమ్‌ గెలిచి జోరు మీద కనిపించిన క్విమ్సి.. తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్‌లు చేజార్చుకుంది. అయితే పతకం సాధించడానికి క్విమ్సికి మరో అవకాశం ఉంది. ఇవాళ కాంస్యం కోసం ఆమె పోటీపడనుంది. పాజ్........... మహిళల క్రికెట్‌లో భారత్ ఇప్పటికే సెమీస్‌కు దూసుకెళ్లడంతో పాటు నిన్న ఇతర ప్రాథమిక ప్రాక్టీస్ సెషన్‌లు జరిగాయి. ఇవాళ ఆసియా క్రీడల్లో పూర్తి స్థాయి పతకాల వేట ప్రారంభమైంది. ఇవాళ ఉమెన్స్ టీ20 సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు , బంగ్లాదేశ్ మహిళల జట్టు తలపడనున్నాయి.  భారత మహిళల హాకీ జట్టు 'పూల్ బి' మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌తో తలపడుతోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత పురుషుల హాకీ జట్టు 'పూల్ ఏ'లో ఇండోనేషియాతో ఆడనుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, టీమ్ విభాగాలలో స్టార్ షూటర్ ఎలవెనిల్ వలరివన్, సోనమ్ ఉత్తమ్ మస్కార్ తదితరులు పతకాల కోసం పోటీ పడుతున్నారు. పాజ్....... గత ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించిన భారత్... ఈసారి ఆ పతకాల సంఖ్యను మరింత పెంచుకోవాలని పట్టుదలతో ఉంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమవడం కొంత నిరాశ కలిగించినప్పటికీ, మిగతా స్టార్ అథ్లెట్లపై భారత్ ఆశలు పెట్టుకుంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.