క్రీడలు
ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జ్యోతి సురేఖకు ఘన స్వాగతం
05-10-2026 13:09
026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
xPress24, Gannavaram, October 5,
గన్నవరం:
2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులు ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జ్యోతి సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల్లో నాలుగుసార్లు స్వర్ణ పతకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు ఇంత అద్భుతమైన స్వాగతం లభించడం ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపారు. రాబోయే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు జ్యోతి సురేఖ వెల్లడించారు.