క్రీడలు
ఆసియా గేమ్స్
26-09-2026 10:12

ఆసియా గేమ్స్- 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ (pole vault) ఈవెంట్‌లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటివరకు నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్‌వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10 వేల మీటర్ల దూరాన్ని 28 నిమిషాల 29 సెకెన్ల 38 మిల్లీ సెకెన్లలో పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 2 స్వర్ణం, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించింది.
xPress24, Krishna District, September 25,