xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
క్రీడలు

ఆసియా క్రీడలు: కబడ్డీలో అమ్మాయిల సత్తా.. భార‌త్ ఖాతాలో మ‌రో గోల్డ్‌

30-09-2026 09:37
ఆసియా క్రీడలు: కబడ్డీలో అమ్మాయిల సత్తా.. భార‌త్ ఖాతాలో మ‌రో గోల్డ్‌
ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.
ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 37-33 పాయింట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు హోరాహోరీగా సాగింది. ద్వితీయార్థంలో ఒక దశలో 36-31 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఇరాన్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే, చివరి నిమిషాల్లో భారత అమ్మాయిలు ఒత్తిడిని అధిగమించి కీలక పాయింట్లు సాధించారు. ఫైనల్ విజిల్ మోగేసరికి నాలుగు పాయింట్ల ఆధిక్యంతో స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నారు.ఈ విజయంతో భారత పతకాల సంఖ్య 27కి (3 స్వ‌ర్ణాలు, 11 ర‌జ‌తాలు, 13 కాంస్యాలు) చేరింది. ఈరోజు దేశానికి అందిన నాలుగో పతకం ఇది. ఇక, కాసేపట్లో జరగనున్న పురుషుల కబడ్డీ ఫైనల్‌లో కూడా భారత జట్టే ఇరాన్‌తో తలపడనుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.