xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
జాతీయం

ఇండియా ఎనర్జీ డైలాగ్ ఉన్నత స్థాయి సమావేశం -హర్దీప్ సింగ్ పూరి

23-09-2026 05:30
రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్‌కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) - ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ ఘైస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించారు. ఈ సమావేశంలో చమురు మార్కెట్ స్థిరత్వం, ఇంధన భద్రత, చమురు పరిశ్రమల పెట్టుబడుల ప్రాముఖ్యత గురించి చర్చించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ... భారత్, ఒపెక్ స‌భ్య‌ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబందాలు కీలక ఇంధన సమస్యలపై.. పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని కేంద్రమంత్రి ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి, సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అభివృద్ధి చేయడంలో ఒపెక్, భారతదేశం కలిసికట్టుగా పని చేయాలని హర్దీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు.
xPress24, Krishna District, September 22,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.