ఆంధ్రప్రదేశ్
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.33 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం
26-09-2026 09:42

బాపట్ల జిల్లా పరిధిలో పగలు, రాత్రి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను చందోలు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
xPress24, Bapatla, September 25,
బాపట్ల, సెప్టెంబర్ 25:
బాపట్ల జిల్లా పరిధిలో పగలు, రాత్రి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను చందోలు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితులు ముందుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి, అనంతరం బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నిందితులను గుర్తించారు. వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి సుమారు
రూ.33 లక్షల విలువైన 182 గ్రాముల బంగారం, 1,050 గ్రాముల వెండి వస్తువులు
స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనాలకు ఉపయోగించిన
రెండు పల్సర్ బైక్‌లను
కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాపట్ల జిల్లా ఎస్పీ
బి. ఉమామహేశ్వర్
కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.