తెలంగాణ
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు
24-09-2026 10:00

తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు "ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026" నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ర్క తెలిపారు. సదస్సు నిర్వహణ పర్యవేక్షణ కోసం దాదాపు పది ప్రత్యేక అధికారుల కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
xPress24, Hyderabad, September 24,