xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
తెలంగాణ

ఈ నెల 23 నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బీజేపీ రైతు పాదయాత్ర

12-10-2026 10:34
ఈ నెల 23 నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బీజేపీ రైతు పాదయాత్ర
రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని మరియు పీఎం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు బీజేపీ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు పాదయాత్ర చేపడుతున్నట్లు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు.
xPress24, Adilabad, October 12, రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పీఎం ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 వ తేదీ నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 'రైతు పాదయాత్ర' చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పీఎం ఫసల్ బీమా అమలవుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం అమలు కాకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మెరుగైన బీమా అందిస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందని, రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ రైతు డిక్లేరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు బీజేపీ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

🎥 వీడియో

ఈ నెల 23 నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బీజేపీ రైతు పాదయాత్ర

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.