xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలురాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తాం - భట్టిదిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసనఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావుభారత్‌ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్‌యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందంగ్రామీణ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు
జాతీయం

ఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావు

06-10-2026 17:12
న్యూదిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రతిపక్ష ‘ఇండి’ కూటమి ఎంపీలు యత్నించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తప్పుబట్టారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విపక్షాల తీరును తీవ్రంగా ఖండించారు.
xPress24, Hyderabad, October 6, న్యూదిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు యత్నించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తప్పుబట్టారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కించపరిచేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దేశంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఏకంగా పన్నెండు సార్లు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిగిందని గుర్తుచేశారు. ఓట్లు చోరీ అయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా హాస్యాస్పదమని కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా ఓట్ల దొంగతనంతోనే పార్లమెంటు సభ్యులుగా గెలిచారా అని ఆయన నిలదీశారు. రాజ్యాంగ సంస్థలపై విపక్షాల దాడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను, రాజ్యాంగబద్ధ సంస్థలను విపక్షాలు నిత్యం లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆయన ఆక్షేపించారు. ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతరం జరిగే పరిపాలనా ప్రక్రియ అని, దీనిపై రాజకీయం చేయడం సరికాదని స్పష్టం చేశారు. అభివృద్ధిని ఓర్వలేకే నిరసనలు దేశంలో జరుగుతున్న అభివృద్ధిని, సంస్కరణలను ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఇలాంటి పద్ధతులకు పాల్పడుతున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో విపక్షాల కుట్రలను తిప్పికొడతారని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🎥 వీడియో

ఈసీ కార్యాలయం ముట్టడి యత్నం హాస్యాస్పదం: రామచందర్ రావు

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.