జాతీయం
ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన -అమిత్ షా
26-09-2026 10:11

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (యూపీఐటీఎస్)ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ.. 2047 నాటికి `వికసిత్ భారత్` అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, చురుకైన పాలనతో ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణం ఏర్పడిందని అమిత్ షా తెలియజేశారు.
xPress24, Krishna District, September 25,