ఆంధ్రప్రదేశ్
ఉన్నత విద్యా విధానం 2026కు మంత్రివర్గం ఆమోదం
08-10-2026 09:50

రాష్ట్రంలో విదేశీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం రూపొందించిన ఉన్నత విద్యా విధానం 2026కు, విద్యా చట్ట సవరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని అభినందిస్తూ.. రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు.‘తల్లికి వందనం’ పధకానికి 10,208 కోట్లు కేటాయింపుతో పాటు వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10 శాతం పెంపు వంటి నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.
xPress24, Amaravati, October 8,