విద్య
ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్
23-09-2026 05:30
శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్ట్రలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్‌దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యోగా కేవలం ఒక తరానికి చెందిన సంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
xPress24, Krishna District, September 18,