బిజినెస్
ఎండీఎల్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
23-09-2026 05:30
ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు ‘మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్’ (ఎండీఎల్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో ఎండీఎల్, ‘నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్-ఏపీ’ (ఎన్‌ఎస్‌హెచ్‌ఐపీ-ఏపీ) మధ్య అవగాహన ఒప్పందం ఈరోజు జరిగింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుపై ఎండీఎల్ సుమారు 15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
xPress24, Krishna District, September 18,