xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ స్థాయి సరస్ ఆజీవికా మేళా

25-09-2026 14:47
విజయదశమి సందర్భంగా జాతీయ స్థాయి SARAS Aajeevika Mela–2026ను ఎన్టీఆర్ జిల్లాలోని పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
xPress24, Vijayawada, September 25, విజయవాడ: విజయదశమి సందర్భంగా జాతీయ స్థాయి SARAS Aajeevika Mela–2026 ను ఎన్టీఆర్ జిల్లాలోని పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, SERP శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం పున్నమి ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్‌చంద్ తదితర అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళా శక్తిని మహాశక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ‘లఖ్‌పతి దీదీ’లకు అనేక అవకాశాలను కల్పిస్తున్నారని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి ద్వారా రూ.20 లక్షలకు పైగా ఆదాయం సమకూర్చే దిశగా దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జాతీయ స్థాయిలో నిర్వహించే SARAS Aajeevika Mela–2026 ను తొలిసారిగా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలకు అనుగుణంగా తయారు చేసే ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ఈ మేళాలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 8 నుంచి 22వ తేదీ వరకు మేళాను నిర్వహించనున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు SARAS Aajeevika Mela మరింత ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.

🎥 వీడియో

ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ స్థాయి సరస్ ఆజీవికా మేళా

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.