ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
16-10-2026 14:17
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
xPress24, Vizianagaram, October 16,
విజయనగరం, అక్టోబరు 16:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
శుక్రవారం ఆయన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను, నామినేషన్ల స్వీకరణ కౌంటర్లను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.