xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
తెలంగాణ

ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావు

05-10-2026 15:54
ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావు
బీజేపీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పార్టీ ముందుకెళ్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సబబుకాదని రాంచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే ఈసీని తప్పుపట్టడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తుంటే ఓటమి భయంతో ‘ఇండి’ కూటమి విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేసిన ఆయన.. అక్టోబర్ 7న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న ‘సేవా జ్యోతి యాత్ర’, ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
xPress24, HYDERABAD, October 5,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.